News December 25, 2024
HYDలో రోడ్డుప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి

సోమవారం HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దోమకొండకు చెందిన శివాని(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను బైక్‌పై తీసుకెళ్లిన మహ్మద్‌నగర్ మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కాగా వీరిద్దరు నిజాంసాగర్ నవదయలో ఈ నెల 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 2, 2026
NZB: అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్ బాధ్యతలు

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 2, 2026
NZB: హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హోలీ పండుగ సందర్భంగా నిజామాకబాద్ జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిజామాబాద్ పోలీస్ చట్టం సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆంక్షలు ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.
News March 2, 2026
NZB: ఇంటర్ పరీక్షలకు.. 687 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్-1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. NZB జిల్లా వ్యాప్తంగా 21,473 మంది విద్యార్థులకు 687 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. 18,695 మంది జనరల్ విద్యార్థుల్లో 525 మంది, 2,778 ఒకేషనల్ విద్యార్థులకు 162 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని అధికారులు వివరించారు.


