News December 25, 2024

హైదరాబాద్‌లో ప.గో.జిల్లా సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

హైదరాబాదులో ప.గో.జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన కె. భగవాన్ (26) తన రెంట్ హౌస్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగవాన్‌కు ఫిబ్రవరి నెలలో వివాహం నిశ్చయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు ఎవరు కారణం కాదని లేఖ రాశాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 31, 2025

సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

image

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్‌ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

News December 31, 2025

జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.