News December 25, 2024
సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్
TG: ఈ సీజన్లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.
Similar News
News December 26, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 73,301 మంది భక్తులు దర్శించుకోగా 26,242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీకి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరింది.
News December 26, 2024
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?
తెలంగాణ CM రేవంత్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది. నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.
News December 26, 2024
రూ.99 మద్యంలో తగ్గిన నాణ్యత?
AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూ.99కే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకట్రెండు ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.