News December 25, 2024
NLG: ఎవరు ‘నామినేట్’ అవుతారు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు తహతహలాడుతున్నారు. పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. కాగా జిల్లాస్థాయి హోదాలైన గ్రంథాలయ సంస్థ, వైడీటీఏ, పలు కార్పొరేషన్ల పదవులు ఆశిస్తున్నారు. దీనికోసం అగ్ర నేతలను తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేశామని, తమకే పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.
Similar News
News November 7, 2025
Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 7, 2025
బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.
News November 6, 2025
నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.


