News March 16, 2024

ఉమ్మడి ప్రకాశం YCP అభ్యర్థులు వీరే..

image

☛ యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్ ☛ దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
☛ పర్చూరు – ఎడం బాలాజీ , చీరాల- కరణం వెంకటేశ్ ☛ అద్దంకి – హనిమిరెడ్డి
☛ సంతనూతలపాడు – మేరుగు నాగార్జున ☛ ఒంగోలు – బాలినేని శ్రీనివాస్ రెడ్డి , ☛ కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్ ☛ కొండపి – ఆదిమూలపు సురేశ్, ☛ మార్కాపురం – అన్నా రాంబాబు ☛ గిద్దలూరు – కె.నాగార్జునరెడ్డి
☛ కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్

Similar News

News January 9, 2026

అమరావతి ఆవకాయ ఉత్సవాల్లో కలెక్టర్

image

విజయవాడ భవానీ ద్వీపంలో నిర్వహించిన ఆవకాయ్‌ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. రెండో రోజు చేపట్టిన కార్యక్రమాలు నగరవాసులు, పర్యాటకుల నుంచి విశేష స్పందనను పొందాయి. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నగాడా వాయిద్యాలు ప్రాంతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించగా, సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News January 9, 2026

తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.

News January 9, 2026

సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

image

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.