News December 25, 2024
తిరుమల పరకామణిలో కుంభకోణం?

AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.
Similar News
News September 23, 2025
కోళ్ల దాణా నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News September 23, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జాబ్‌లు

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(<
News September 23, 2025
స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 MPP, జడ్పీటీసీ, 2,421 MPTC, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 ZPTC, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ, 6 ZP స్థానాలను బీసీలకు కేటాయించింది.