News December 25, 2024
ఆడారిని వద్దన్న TDP.. రమ్నన్న BJP..!
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ రాజకీయ జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. MLAగా విశాఖ వెస్ట్ నుంచి YCPనుంచి ఓడిపోయిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమిప్రభుత్వం వచ్చాక డెయిరీలో అక్రమాలు జరిగాయని జిల్లా TDPనాయకుల ఆరోపణలతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. అయితే TDPలో ఆయన చేరేందుకు ప్రయత్నించగా స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో BJPలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News December 26, 2024
ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!
వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్‌లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.
News December 26, 2024
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.
News December 26, 2024
విశాఖ: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.