News March 16, 2024
కవిత అరెస్ట్ ఒక నాటకం: సీఎం రేవంత్

TG: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ BJP, BRS కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. PM మోదీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 21, 2025
APLలో హేమంత్ విధ్వంసం

ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2025లో భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్తో అదరగొట్టారు. విజయవాడ సన్షైనర్స్తో మ్యాచ్లో కేవలం 43 బంతుల్లోనే 6 సిక్సులు, 3 ఫోర్లు బాది 71* రన్స్ చేశారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి, కేవలం 19 పరుగులే ఇచ్చారు. 161 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భీమవరం బుల్స్.. హేమంత్, హిమకర్(43) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
News August 21, 2025
చైనాను నమ్మొచ్చా?

అమెరికా టారిఫ్స్కు వ్యతిరేకంగా <<17476240>>భారత్-చైనా<<>> దగ్గరవుతున్నాయి. తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది. అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాను దాటి ప్రపంచ నం.1 అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే USను దూరం చేసుకోవద్దంటున్నారు. దీనిపై మీ COMMENT?
News August 21, 2025
రేపు తెలంగాణ బంద్.. పెరుగుతున్న మద్దతు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా OU జేఏసీ పిలుపునిచ్చిన రేపటి <<17475943>>తెలంగాణ బంద్కు<<>> మద్దతు పెరుగుతోంది. యాదాద్రి జిల్లా వ్యాపారులు రేపు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ సహా నల్గొండ జిల్లాలోని హాలియా, దేవరకొండలో బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు.