News December 25, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
TG: సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని HYD పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. విచారణ సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 26, 2024
వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేం: సీఎం
TG: తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.
News December 26, 2024
బాక్సింగ్ డే టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట
బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి AUS 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆసీస్ టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలు చేశారు. స్మిత్(68*), కమిన్స్(8*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. తొలి రోజే 87,242 మంది అభిమానులు హాజరయ్యారని, ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని క్రీడా వర్గాలు తెలిపాయి.
News December 26, 2024
వైకుంఠద్వార దర్శనం.. 9 చోట్ల టికెట్ల జారీ!
మార్చి-2025 నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా క్షణాల్లో బుక్ అయిపోయాయి. వీటితో పాటు వైకుంఠద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల విడుదలపై ప్రకటన చేసింది. 2025 జనవరి 10-12 వరకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్‌లు అందజేస్తామని తెలిపింది. వీటిని జనవరి 8న ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 ప్రదేశాల్లో అందజేస్తారు. కాగా, ఈ పది రోజుల్లో టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించరు.