News December 25, 2024
FLASH: నరసరావుపేట హైవేపై బస్సు బోల్తా

నరసరావుపేట మండలం ఉప్పలపాడు-పెట్లూరివారిపాలెం మధ్య ఉన్న రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది, గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News January 12, 2026
GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.
News January 12, 2026
తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.
News January 12, 2026
గుంటూరు GMC కమిషనర్ బదిలీ.. కొత్త కమిషనర్ ఈయనే!

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనివాసులు స్థానంలో కె.మయూర్ అశోక్ గుంటూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మయూర్ అశోక్ విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.


