News December 25, 2024

విశాఖ: ‘యాక్షన్-ప్యాక్డ్ క్షణాలకు సిద్ధంగా ఉండండి’

image

ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it

Similar News

News November 9, 2025

షీలా నగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలా నగర్ జంక్షన్‌లో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాల సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు.

News November 9, 2025

‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

image

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 9, 2025

6,000 మందితో గీతా పారాయణం

image

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.