News December 25, 2024

Photo Of The Day: జగన్‌కు ప్రేమతో..!

image

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర దృశ్యం జరిగింది. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆయన తన తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విజయమ్మ ఆప్యాయంగా జగన్‌ను ముద్దాడింది. ఇదే ‘ఫొటో ఆప్ ది డే’ అంటూ వైసీపీ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బోటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.

News February 28, 2026

కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బాటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.

News February 28, 2026

ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.