News December 25, 2024

రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష వేయిస్తాను: ట్రంప్

image

తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలోని రేపిస్టులు, హంతకులు, నరరూప రాక్షసులకు మరణ శిక్ష పడేలా చూస్తానని US అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరణశిక్ష పడాల్సిన 40మందిలో 37మందికి క్షమాభిక్ష పెట్టానని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ‘నా దేశంలోని కుటుంబాల్ని, పిల్లల్ని కాపాడుకునేందుకు మరణశిక్షల్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయిస్తాను’ అని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

image

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.

News November 8, 2025

కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

image

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.