News December 25, 2024
అరవింద్ కేజ్రీవాల్‌ది గోలా? సెల్ఫ్ గోలా?
ఢిల్లీ CM ఆతిశీని అక్రమ కేసులో అరెస్టు చేస్తారన్న కేజ్రీవాల్ మాటలపై చర్చ జరుగుతోంది. మహిళలకు నగదు బదిలీ, సంజీవనీ స్కీములేమీ లేవంటూ HFW శాఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీన్నుంచి డైవర్ట్ చేయడమే ఆయన ప్లానని కొందరు అంటున్నారు. ఆప్‌లో ఆయన్ను మించి ఎవర్నీ ఎదగనివ్వరని, క్రమంగా ఆతిశీని సైడ్‌లైన్ చేస్తున్నారని మరికొందరి అంచనా. పార్టీ ఫౌండింగ్ మెంబర్స్‌ను తరిమేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News December 26, 2024
నిమిషానికి 158 బిర్యానీలు తినేశారు!
సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, పండుగొచ్చినా బిర్యానీలు తినాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఆర్డర్ చేస్తే ఇంటికే బిర్యానీ వస్తుండటంతో స్విగ్గీ బుకింగ్స్‌లో బిర్యానీ <<14970078>>టాప్‌లో<<>> నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది నిమిషానికి ఏకంగా 158 బిర్యానీలు బుక్ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 150గా ఉండగా 2022లో 137, 2021లో 115, 2020లో నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వచ్చేవి. ఏటా బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.
News December 26, 2024
విరాట్ కోహ్లీకి భారీ జరిమానా
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్‌ను విరాట్ <<14982204>>స్లెడ్జ్<<>> చేసిన ఘటనపై ICC తీవ్రంగా స్పందించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు రాగా ఫైన్‌తో సరిపెట్టింది.
News December 26, 2024
బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు: CM రేవంత్
TG: సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. టాలీవుడ్‌కు బ్రాండ్ తీసుకొచ్చి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.