News December 25, 2024
ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక పరిణామం

AP: మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడ అమలవుతోన్న మహాలక్ష్మీ పథకం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం అక్కడ తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాల గురించి రేవంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 23, 2025
ఫాస్ట్‌ఫుడ్‌తో సంతానోత్పత్తి సమస్యలు

ఫాస్ట్‌ఫుడ్స్ వలన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అందరికీ తెలిసిందే. ఆడవారిలో వీటివల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు చేసిన అధ్యయనంలో పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్‌లో పెర్ఫ్లూక్టేనోయిక్ యాసిడ్, పెర్ఫ్లూరూక్టేన్ సల్ఫోనేట్ కలుస్తాయని వెల్లడైంది. ఇవి మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతాయని తేలింది.
News September 23, 2025
పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.
News September 23, 2025
‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్

వరల్డ్‌లోని ‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్ ఉన్నట్లు USలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తెలిపింది. శాస్త్రవేత్తలు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్, తదితర అంశాలను పరిగణించి లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఇండియాలోని IITల నుంచి 755 మంది, NITల నుంచి 330 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని IIT, NIT, HCU, IIM(వైజాగ్), ఇతర వర్సిటీల నుంచి 100 మందికి పైగా చోటు దక్కించుకున్నారు.