News December 25, 2024

ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 26, 2024

NGKL ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి

image

హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

News December 26, 2024

క్రిస్మస్ వేడుకలతో దద్దరిల్లిన మహబూబ్‌నగర్

image

క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

News December 26, 2024

MBNR: నేడు జిల్లాకు కేంద్రమంత్రి రాక

image

నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.