News March 16, 2024

ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు

image

వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.

Similar News

News November 21, 2024

అవును.. మా అమ్మాయికి పెళ్లి: కీర్తి సురేశ్ తండ్రి

image

నటి కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్‌తో వచ్చే నెలలో గోవాలో ఆమె వివాహం చేయనున్నట్లు కీర్తి తండ్రి సురేశ్ కుమార్ ఆన్‌మనోరమ వార్తాసంస్థకు తెలిపారు. తట్టిల్‌కి కేరళ, చెన్నైలో వ్యాపారాలున్నాయి. కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఆయన వెల్లడించారు.

News November 21, 2024

కీర్తి సురేశ్ కాబోయే భర్త ఆస్తులెంతో తెలుసా?

image

హీరోయిన్ కీర్తి సురేశ్, ఆంథోనీ తట్టిల్‌ ఒకే స్కూళ్లో చదువుకున్నారు. 12వ తరగతి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆంథోనీ కొన్నాళ్లు గల్ఫ్ దేశం ఖతర్‌లో పని చేశారు. ఆ తర్వాత కొచ్చి (కేరళ)కి వచ్చి ఓ కంపెనీ స్థాపించారు. Asperos అనే మరో సంస్థ, హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంథోనీకి సుమారు రూ.300 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.

News November 21, 2024

2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే

image

TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.