News December 25, 2024

VZM: ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు

image

యేసు క్రీస్తు జననం సందర్భంగా జిల్లాలో నిర్వహించే క్రిస్టమస్ వేడుకల్లో ఎటువంటి అల్లర్లు, మతపరమైన తగాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చిల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు.

Similar News

News December 26, 2024

విజయనగరం: పోలీస్ ఉద్యోగమే లక్ష్యం

image

రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజ్జీ, రాజీవ్, అయోధ్య, మైదానాలన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. వర్షంతో మైదానాలు బురదమయం కాగా ఖాకీ కొలువు కోసం యువత అవరోధాలను అధిగమించి ప్రాక్టీస్ ముమ్మరం చేస్తున్నారు. వీరికి ఈనెల 30వ తేదీ నుంచి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో ఈవెంట్స్ జరగనున్నాయి.

News December 26, 2024

విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

పార్వతీపురం: నేడు విద్యా సంస్థలకు సెలవు

image

తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.టీ.నాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.