News December 26, 2024

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్: మోహన్ లాల్

image

ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News September 23, 2025

PCOS ఉంటే వీటికి దూరంగా ఉండండి

image

ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య పీసీఓఎస్. WHO నివేదికల ప్రకారం పదిమందిలో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే PCOS ఉన్నవారు కొన్నిపదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు ఈస్ట్రోజన్ స్థాయులపై ప్రభావం చూపి నెలసరిని ఆలస్యం చేస్తాయి. మాంసంలో ఉండే ప్రొటీన్లు మంచివే కానీ, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

News September 23, 2025

ముఖం చూసి ఆర్థిక స్థితిని చెప్పొచ్చు!

image

ఒకరి ముఖాన్ని చూసి వారు సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారో చెప్పగలం. అయితే వారి సామాజిక ఆర్థిక స్థితిని కూడా మెదడు అంచనా వేయగలదని టొరంటో యూనివర్సిటీ పరిశోధనలో తెలిసింది. ముఖ కవళికలు, కళ్ల చుట్టూ ఉన్న గీతలు, చర్మంలోని మార్పుల ఆధారంగా అంచనా వేస్తుందట. తరచూ ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి వంటివి ముఖంపై ప్రభావం చూపుతాయి. వీటిని బట్టి వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి మెదడు ఓ అవగాహనకు వస్తుంది.

News September 23, 2025

NHPCలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(<>NHPC<<>>) 20 ఇండస్ట్రియల్ ట్రైనీ(ఆర్టికల్ ట్రైనీ) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. ICAI నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 12 నుంచి 15నెలల వరకు నెలకు రూ.20వేల చొప్పున స్టైపండ్ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందజేస్తారు.