News December 26, 2024

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్

image

TG: కర్ణాటకలోని బెలగావిలో గురువారం నుంచి జరిగే CWC సమావేశాల్లో పాల్గొనేందుకు CM రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బెలగావికి పయనమవుతారు. వందేళ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహ బైఠక్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Similar News

News November 14, 2025

‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్‌ ఓటమి కూడా ఈసారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

News November 14, 2025

చేతికి కంకణం ఎందుకు కట్టుకోవాలి..?

image

పూజ తర్వాత చేతికి కంకణం కట్టుకోవడం మన ఆచారం. పూజా ఫలం ఈ కంకణం ఉన్నన్ని రోజులు మనతోనే ఉండి, రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కంకణం మణికట్టుపై ఉన్న ముఖ్య నరాలపై ఒత్తిడి కలిగించి, జీవనాడి ప్రభావంతో హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని బంధించి, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్ర రక్షా కవచం లాంటిది. దీనిని మగవారు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలట.

News November 14, 2025

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

image

AP: రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వైజాగ్‌లో CII భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. దీని కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ CM చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది.