News December 26, 2024

30న భద్రాద్రి రామాలయ హుండీ లెక్కింపు: ఈవో

image

భద్రాద్రి రామాలయంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈ నెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చడం జరిగిందన్నారు. ఉ.8 గంటలకు దేవస్థానంలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

image

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 12, 2025

రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సమీక్ష నిర్వహించారు. వెల్ఫేర్ అధికారులతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాల కల్పనపై సమగ్రంగా చర్చించారు. పాఠశాలల పనితీరును బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు.

News September 12, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ప్రధాన న్యాయమూర్తి

image

ఖమ్మం జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ తెలిపారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’అని పేర్కొన్నారు. రాజీపడదగిన కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక ఉత్తమ అవకాశం అని ఆయన చెప్పారు.