News December 26, 2024
నేడే ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక

పొన్నవరం గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు. ఈ పోటీలకు 2008 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News January 23, 2026
కృష్ణా: జెడ్పీలో 25 మందికి పదోన్నతులు

జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 25 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతి కల్పించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ హైస్కూల్స్‌లో 20 మంది, ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు టైపిస్ట్‌లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆమె తెలిపారు.
News January 23, 2026
కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.
News January 23, 2026
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని, దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకున్న నాడే సమసమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులచే ‘నా దేశం-నా ఓటు’ నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.


