News March 16, 2024
భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 1/2
సూర్యుడి చుట్టూ పరిభ్రమణంతో భూమి వాతావరణం మారుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ వాతావరణంపై మార్స్ ప్రభావం కూడా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. పరిభ్రమణం, కక్ష్యలో మార్పుల వల్ల ప్రతీ 24లక్షల ఏళ్లకు ఓసారి భూమి, మార్స్ దగ్గరగా వస్తాయట. ఈ క్రమంలో ఇరు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఒకదానిపై మరోటి ప్రభావం చూపిస్తాయట. ఫలితంగా భూ వాతావరణం మారుతుందట. దీనిని గ్రాండ్ సైకిల్ అంటారు.
Similar News
News November 17, 2024
డయాబెటిస్.. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారం మానేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం & రాత్రి మాత్రమే భోజనం చేయడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. దీంతోపాటు అధిక HbA1C, ఇన్సులిన్ ప్రతిస్పందన బలహీనపడటం వంటివి జరుగుతాయన్నారు. కాబట్టి అల్పాహారం మానేయొద్దని సూచించారు. SHARE IT
News November 17, 2024
ఆధార్‌లో DOB మార్పులపై కీలక ప్రకటన
AP: ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీచేసే ధ్రువీకరణ పత్రాలనూ అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికెట్ల మాదిరే GOVT ఆస్పత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి సూచించింది.
News November 17, 2024
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇకపై తెలంగాణ పోలీస్
TG: రాష్ట్ర పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు యూనిఫాంలోని బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీస్(TSP) అనే అక్షరాలు ఉండేవి. ఇకపై తెలంగాణ పోలీస్(TGP)గా మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలీసులకు సంబంధించిన TSSP స్థానంలో TGSPతో పాటు TSPSకు బదులు TGPS అనే అక్షరాల బ్యాడ్జీలు వాడాలని ఆదేశించారు.