News December 26, 2024
NLG: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1770 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 856, సూర్యాపేట జిల్లాలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ జీపీలు ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.
Similar News
News January 17, 2026
NLG: మున్సిపాలిటీల్లో ఆధిపత్యం ఆమెదే!

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 21,014 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మహిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా BRS, BJP సైతం మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
News January 17, 2026
NLG: ఓటర్ల తుది జాబితా షెడ్యూల్ పూర్తి

జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,66,437 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మహిళలు 3,44,661 మంది, పురుషులు 3,23,647 మంది, ఇతరులు 129 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది.
News January 17, 2026
NLG: నేడు ఆ రిజర్వేషన్లు ఖరారు!

జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు శనివారం ఖరారు కానున్నాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో ఖరారు చేస్తుండగా, మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ప్రకటించనున్నారు. రిజర్వేషన్‌ల లెక్క తేలనుండటంతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


