News December 26, 2024
విశాఖ: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 27, 2024
PHOTO: వంజంగిలో ఎర్రబడ్డ ఆకాశం
అల్లూరి ఏజెన్సీ విభిన్న వాతావరణాలకు నిలయం. ఇక్కడ ఏ సమయంలో వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. ఎప్పుడూ మేఘాలతో ఉండే పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆకాశం ఎర్రగా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఈ దృశ్యాల్ని బంధించి ఆందించారు.
News December 27, 2024
వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.
News December 27, 2024
విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.