News December 26, 2024

ఖమ్మం: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

image

జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.

Similar News

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి పట్ల భట్టి సంతాపం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.’గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప మేధావిని కోల్పోయింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

News December 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ లైన్స్

image

∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల సమీక్ష ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News December 27, 2024

ALERT.. KMM: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదో సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.