News December 26, 2024

విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2026

విశాఖ: చందనోత్సవం వేళ.. 185 వాటర్ స్టాల్స్

image

సింహాచలంలో స్వామివారికి జరుగబోయే చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో GVMC చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. భక్తుల కోసం 185 వాటర్ స్టాల్స్, 6000 బబుల్ వాటర్ క్యాన్లు, 40,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశామన్నారు. 1,860 శానిటరీ సిబ్బంది, 600 డస్ట్ బిన్లు, 20 వాటర్ ట్యాంకర్లతో పాటు 372 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 18, 2026

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

image

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 18, 2026

ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

image

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.