News December 26, 2024
ప.గో విషాదం నింపిన విహార యాత్ర
విహార యాత్ర విషాదాన్ని నింపింది. ద్వారకాతిరుమల (M) ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం వేకువ జామున ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న గౌతమ్ మృతి చెందాడు.
Similar News
News December 27, 2024
ఉండి: పార్శిల్లో డెడ్‌బాడీ.. నిందితురాలిగా పదేళ్ల చిన్నారి.!
ఉండి (M) యండిగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో డెడ్‌బాడీ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం సంచలనం రేపుతోంది. తులసి ఆస్తి కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతని ఇద్దరి భార్యల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలో మూడో భార్య కుమార్తె హస్తం కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలి జాబితాలో చేర్చారు. దీనిపై నేడు SP ఆద్నాం నయీం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
News December 27, 2024
ద్వారకతిరుమల: టాయ్ నోట్లతో వ్యాపారిని మోసం చేసిన యువకులు
ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ వ్యవహరంలో వ్యాపారిని మోసం చేసిన ఘటన గురువారం జరిగింది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు సుభాష్ అనే వ్యాపారిని నగదు 2.50 లక్షలు ఇస్తే నకిలీ కరెన్సీ రూ.15 లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. అసలు నోట్లను సుభాష్ ఇచ్చి యువకుల నుంచి బ్యాగ్‌ను తీసుకున్నారు. టాయ్ కరెన్సీ ఉండటంతో కంగుతున్న సుభాష్ తన బ్యాగ్‌ను లాక్కున్నాడు. ఒకరిని పోలీసులకు అప్పగించగా మరో యువకుడు పరారయ్యాడు.
News December 27, 2024
ఏలూరు జిల్లాలో రూ. 92.02 కోట్లు మంజూరు: కలెక్టర్
ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.