News December 26, 2024
UPDATE.. వరంగల్: శ్వాస సంబంధిత సమస్యతో విద్యార్థిని ఆత్మహత్య: SI
హన్మకొండలోని ఏకశిలా కాలేజీలో <<14975739>>ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని<<>> ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కేయూ పోలీస్ స్టేషన్ ఎస్సై బి.రవిందర్ వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన శ్రీదేవి శ్వాస సంబంధిత వ్యాధి సమస్యతో హాస్టల్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాగా, దీనికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు రాత్రి వరకు ఆందోళన చేశాయి. కేసు నమోదైంది.
Similar News
News January 14, 2025
జనగామ: హత్య కేసులో నిందితుల ARREST
హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.
News January 14, 2025
వరంగల్: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.