News March 16, 2024
BREAKING: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలోని టిక్కెట్ కేటాయించాలని గంటా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2026
విశాఖలో నేషనల్ సూపర్ క్రాస్ రేసింగ్.. పార్కింగ్ ఆంక్షలు ఇవే..

విశాఖలోని పాత మున్సిపల్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు ‘MRF నేషనల్ సూపర్ క్రాస్ ఛాంపియన్‌షిప్’ జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు పార్కింగ్ సూచనలు జారీ చేశారు. గాజువాక పోర్ట్ రోడ్డులో, పూర్ణా మార్కెట్ వారు జీవీఎంసీ ప్లాంట్ వద్ద వాహనాలు నిలపాలన్నారు. VVIP పాస్ ఉన్నవారు స్టేడియంలో పార్కింగ్ చేయాలని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
News February 7, 2026
విశాఖ: ఈనెల 14 నుంచి సముద్రంపై చేపల వేట నిషేధం

ఐఎఫ్‌ఆర్ మిలాన్ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, వేట నిషేధం ఉంటుందని మత్స్యకార జేడీ లక్ష్మణరావు తెలిపారు. 30, 37వ వార్డులో కొత్త జాలరి పేట, పెయిందొర పేటలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సజావుగా సాగేందుకు మత్స్యకాలందరూ సహకరించాలని ఆయన కోరారు.