News December 26, 2024
REWIND: కృష్ణా జిల్లాలో పెను విషాదానికి 20 ఏళ్లు
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు 2004 సంవత్సరం పీడకలను మిగిల్చింది. పెను విధ్వంసంలో 27 మంది అసువులు బాసారు. సరిగ్గా నేటికి ఆ విషాద విపత్తు సంభవించి 20 ఏళ్లు. సునామీ సృష్టించిన భీభత్స అలల కారణంగా మంగినపూడి బీచ్ చూడటానికి వచ్చిన 27 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. 4 మండలాలను సునామీ ముంచేయగా రూ.కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు నీట మునగ్గా, మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Similar News
News January 14, 2025
కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ
కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News January 14, 2025
మండవల్లిలో రాష్ట్రస్థాయి పొటేళ్ల పందేలు
మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.
News January 13, 2025
అధిష్ఠానం వద్దకు నూజివీడు తెలుగు తమ్ముళ్ల రగడ
నూజివీడులో తెలుగు తమ్ముళ్ల రగడ అధిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి పార్థసారథి వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండా పట్టిన వారికి కాకుండా, అధికారంలోకి రాగానే టీడీపీ తీర్థం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాగా చాట్రాయి మండలంలో టీడీపీకి కార్యకర్తలు రాజీనామా చేశారు.