News March 16, 2024
తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
Similar News
News September 3, 2025
రాజమండ్రి టీచర్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

రాజమండ్రి లాలాచెరువు హైస్కూల్ ఉపాధ్యాయురాలు మోటూరి మంగారాణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. వృత్తిపట్ల అంకితభావం, నూతన టెక్నాలజీతో బోధన చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. టీచర్లకు అవసరమైన ఎన్నో చక్కటి వీడియోలు రూపొందిస్తారు. నిత్య విద్యార్థిగా ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా రాణిస్తున్నారు. సెప్టెంబర్ 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
News September 3, 2025
రాజమండ్రి: ‘3.30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు’

తూ.గో జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటివరకు 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. బుధవారం కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి.కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. జిల్లాలో దాదాపు 92 శాతం గృహాల వివరాలను ఐఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశామని కలెక్టర్ వివరించారు.
News September 3, 2025
బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.