News December 26, 2024
REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి

సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.
Similar News
News January 5, 2026
వింజమూరు: ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

వింజమూరు ఎంపీపీ ఎంపిక గందర గోళానికి దారితీసింది. వైసీపీ తరఫున ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు. కోరం జరగకుండా చూడాలని ఊటుకూరు ఎంపీటీసీ గవ్వల మల్లిఖార్జునను వైసీసీ నేతలు కిడ్నాప్ చేశారు. అయితే.. కోరంకు 6 మంది సరిపోవడంతో ఎంపీపీని ఒకరు ప్రతిపాదించగా.. ఇద్దరు బలపరచడంతో ఎంపీపీగా టీడీపీకి చెందిన వన్నెపెంట హైమావతిని ఎన్నుకున్నారు.
News January 5, 2026
నెల్లూరు: ఒక్క రోజే 28 మంది వరకు అరెస్ట్.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందేలు, పేకాల స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైదాపురం మండల పరిధిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, కావలిలో 5 మంది, ఉదయగిరిలో 6 మంది, రాపూరులో 7 మంది పోలీసులకు చిక్కారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.
News January 5, 2026
నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.


