News December 26, 2024

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు. 

Similar News

News January 14, 2025

NLG: మరో 12 రోజులే.. దగ్గర పడుతున్న గడువు!

image

మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 14, 2025

25 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు.. దర్గా చరిత్ర ఇదే

image

ఈ నెల 25నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.

News January 14, 2025

NLG: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.