News December 26, 2024
దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక అన్నా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DEC 23న రాత్రి స్నేహితుడితో మాట్లాడుతుండగా ఇద్దరు దుండగులు వచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్నేహితుడిని దారుణంగా కొట్టి తరిమేసి, రేప్ చేశారని, అనంతరం న్యూడ్ ఫొటోలు తీశారని తెలిపింది. TNలో మహిళలకు సేఫ్టీ లేదని BJP నేత అన్నామలై మండిపడ్డారు.
Similar News
News December 27, 2024
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం వరకు KTRను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
News December 27, 2024
DAY 2: 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జైస్వాల్(82), కోహ్లీ(36) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం పంత్(6*), జడేజా(4*) క్రీజులో ఉన్నారు. కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు AUS 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 రన్స్ వెనుకబడి ఉంది.
News December 27, 2024
సంక్రాంతి సెలవులపై క్లారిటీ
AP: సంక్రాంతి సెలవుల కుదింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. ఏమైనా మార్పులు ఉంటే అధికారిక ప్రకటన ఇస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా హాలిడేస్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి సెలవులను JAN 11-15 లేదా 12-16 తేదీలకు పరిమితం చేస్తారని ప్రచారం జరిగింది.