News December 26, 2024
ఖమ్మం: రైతుల ఖాతాల్లో రూ.368కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్‌తో భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అటు రైతుల ఖాతాల్లో రూ.368 కోట్లు జమ చేయగా ప్రతీ క్వింటాకు ధరతో సంబంధం లేకుండా రూ.75.32 కోట్లు బోనస్‌గా చెల్లించిందన్నారు. జనవరి చివరి వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2024
ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం
సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల భట్టి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.’గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప మేధావిని కోల్పోయింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.