News December 26, 2024

ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!

image

వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్‌లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.

Similar News

News July 4, 2025

బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

సామాన్యుల ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా బ్యాంకర్లు స‌హ‌కారం అందించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులతో క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో శుక్ర‌వారం సమావేశమయ్యారు. స్వ‌యం స‌హాయ సంఘాల స‌భ్యుల‌కు అందించే రుణాల‌ను స‌కాలంలో రెన్యువ‌ల్ చేయాల‌ని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్.డి. చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

News July 4, 2025

విశాఖ CPT పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష

image

ఏపీ పీసీబీలో నియమితులైన గ్రూప్-2, గ్రేడ్-2 ఉద్యోగుల సీపీటీ పరీక్ష శనివారం మూడు సెషన్లలో జరగనున్నది. 186 మంది అభ్యర్థులు గాజువాక ఎస్.ఎస్. సొల్యూషన్స్ కేంద్రంలో జరిగే పరీక్షకు హాజరవుతారు. ఏర్పాట్లను డీఆర్వో భవానీ శంకర్ సమీక్షించారు. అభ్యర్థులు గంట ముందే రాగలరని, ఐడీ కార్డ్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.

News May 7, 2025

దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు

image

దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దివ్యాంగుల చట్టాలు పక్కాగా అమలు జరగాలన్నారు. దివ్యాంగ బాలలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు దివ్యాంగుల పెన్షన్ డేటాను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు.