News December 26, 2024
HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన

ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్‌లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.
Similar News
News February 25, 2026
HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
News February 25, 2026
HYD: అమ్మాయిలూ ఇది మిస్ అవ్వకండి

మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కరోనా టీకా తరహాలో ఫ్రీ వ్యాక్సిన్‌ను నిర్ణయించింది. త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉంటారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అంచనా. సమీప PHCల్లో 6 నెలల వ్యవధిలో 3 టీకాలు ఉచితంగా అందించనున్నారు.
News February 25, 2026
HYD: నేనేం నేరం చేశానమ్మా..

‘ఏడిస్తే గుండెలకు హత్తుకుంటావని, ఆకలైతే పాలు తాగిస్తావని అనుకున్నానమ్మా. చిట్టిచేతులు కట్టేసి, గంతలు కడితే దాగుడు మూతలు ఆడుతున్నావ్ అనుకున్నానమ్మా! పొయ్యిలో నన్ను కాలుస్తుంటే ఇలా నిన్ను అమ్మా అని పిలుస్తాననుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కింది నువ్వని తెలిసి విలవిలలాడానమ్మా. ఏంనేరం చేశా నాకెందుకీ శిక్ష’ భౌరంపేట్‌లో <<19230114>>పసిబిడ్డ<<>> ఇలా అనుకుని ఉంటుందేమో. 9నెలలు మోసిన తల్లే చంపడం నగరాన్ని కలవరపెడుతోంది.


