News December 26, 2024
నిర్మల్: చెత్త కవర్‌లో శిశువు మృతదేహం లభ్యం
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
Similar News
News December 27, 2024
ఆదిలాబాద్: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News December 27, 2024
మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!
ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.
News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.