News December 26, 2024

సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలివచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైజింగ్‌లా బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామని పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో సినీ పరిశ్రమ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 27, 2024

ఒక్క నెలలో 15% ఎగిసిన Dr.Reddy’s

image

Dr.Reddy’s షేర్లు ఈ నెలలో 15% మేర ఎగిశాయి. గ‌త 51 నెల‌ల్లో మంత్లీ పెరుగుదలలో ఇదే అత్యధికం. 2020 Sepలో 22%, అలాగే 2023 జూన్‌లో 14.5% ఎగిశాయి. రేటింగ్ ఏజెన్సీ నోమురా Dr Reddysకు Neutral నుంచి Buy ఇవ్వ‌డంతో గ‌త 7 సెష‌న్ల‌లో Price 11% పెర‌గ‌డం గ‌మ‌నార్హం. 2026లో ఇత‌ర సంస్థ‌ల‌తో పోటీ, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు అధిక‌మ‌య్యే ప‌రిస్థితి ఉండ‌డం సంస్థ పనితీరుకు పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్‌పై సంచలన కామెంట్స్

image

నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.

News December 27, 2024

Stock Market: గ్రీన్‌లో ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు Friday లాభాల‌తో ముగిశాయి. Sensex 78,699 (+226) వ‌ద్ద‌, Nifty 87 పాయింట్లు ఎగ‌సి 23,837 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఫార్మా 1.30%, ఆటో 0.97%, హెల్త్‌కేర్ 0.80% లాభ‌ప‌డ‌డంతో సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అంత‌ర్జాతీయ సానుకూల సంకేతాల నేప‌థ్యంలో సెషన్ ప్రారంభంలో గంట‌పాటు ర్యాలీ జ‌రిగినా Sensexలో 79,000 వ‌ద్ద‌, Niftyలో 23,900 వ‌ద్ద బలమైన Resistance ఉండడంతో సూచీలు రివ‌ర్స‌ల్ తీసుకున్నాయి.