News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.

Similar News

News December 27, 2024

మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC

image

దేశంలో సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేసి రాజ‌కీయ, ఆర్థిక రంగాల్లో మ‌న్మోహ‌న్ సింగ్ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపార‌ని CWC కొనియాడింది. మాజీ ప్ర‌ధాని గౌర‌వార్థం సమావేశమైన CWC ఆయ‌న నాయ‌క‌త్వ‌మే క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశాన్ని ముందుకు న‌డిపింద‌ని కీర్తించింది. ఆయ‌న లెగ‌సీని కొన‌సాగిస్తామ‌ని తీర్మానించింది. శ‌నివారం ఉద‌యం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యానికి మ‌న్మోహ‌న్ భౌతిక‌కాయాన్ని త‌ర‌లించ‌నున్నారు.

News December 27, 2024

నోట్ల ర‌ద్దుపై మ‌న్మోహ‌న్ ఏమ‌న్నారంటే..

image

నోట్ల ర‌ద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివ‌ర్ణించారు. న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీయ‌డానికే నోట్ల ర‌ద్దు చేశామ‌ని చెప్పిన మోదీ, మొత్తం క‌రెన్సీ న‌ల్ల‌ధ‌నమని- మొత్తం న‌ల్ల‌ధ‌నం క‌రెన్సీ రూపంలో ఉందనే త‌ప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చ‌ర్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిద్రం చేస్తుంద‌ని అనాడు మ‌న్మోహ‌న్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల క‌నిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.

News December 27, 2024

UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త

image

UPI చెల్లింపులపై RBI శుభవార్త చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు PPI సంస్థకు చెందిన UPI ద్వారానే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఫోన్‌పే, పేటీఎం సహా పలు వ్యాలెట్లలోని మొత్తాన్ని ఇతర యాప్‌ల్లోనూ వాడుకోవచ్చు. దీంతో గిఫ్ట్, డిజిటల్ వ్యాలెట్లు వాడే వారికి ఈజీ అవుతుంది.