News March 16, 2024
పెళ్లి చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ కృతి ఖర్బందా వివాహం చేసుకున్నారు. ఆమె మెడలో పుల్కిత్ సామ్రాట్ మూడు ముళ్లు వేశారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. హరియాణాలోని మనేసార్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పంజాబీ స్టైల్లో ఘనంగా జరిగింది. కాగా ఈమె తెలుగులో తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D, బ్రూస్లీ వంటి సినిమాల్లో నటించారు.
Similar News
News April 6, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.
News April 6, 2025
జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.
News April 6, 2025
ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.