News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు?

image

AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.

Similar News

News November 1, 2025

పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

image

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?

News November 1, 2025

JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <>jeemain.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. JEE మెయిన్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ సెషన్ జనవరి 21, 30 తేదీల మధ్య, రెండో సెషన్ ఏప్రిల్ 1, 10 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

News November 1, 2025

IPL: LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?

image

IPL-2026లో LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్‌లో LSG కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్‌ను స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించింది.