News December 26, 2024
భాగవత్‌తో విభేదించిన RSS మ్యాగజైన్
మసీదు-మందిర్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భాగవత్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగజైన్ విభేదించింది. ఈ తరహా వివాదాలు అధికమవుతుండడంపై భాగవత్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు కలిసి ఉండగలరన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం సివిలైజేషన్ జస్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.
Similar News
News December 27, 2024
సజ్జల భార్గవ్‌కు ఊరట
AP: సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. 13 కేసులకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
News December 27, 2024
రికార్డు సృష్టించిన పుష్ప-2 మూవీ
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.740.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన 3వ వారంలోనూ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. 22 రోజుల్లో ఈ సినిమాకు బాలీవుడ్‌లో రూ.740.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రూ.1719.5 కోట్లు కలెక్ట్ చేసింది.
News December 27, 2024
మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్, కేంద్రం మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కోరగా కేంద్రం స్పందించకపోవడంపై INC అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. INCని సంప్రదించకుండానే నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని హోంశాఖ ప్రకటించింది. కాగా స్మారక చిహ్నం ఏర్పాటు ఆయనకు ఘనమైన నివాళి అని మోదీకి ఖర్గే లేఖ రాశారు.