News December 26, 2024
Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లలో శాంటాక్లాజ్ ర్యాలీ కనిపించలేదు. బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 78,472 (-0.39) వద్ద, Nifty 23,750(+22) వద్ద స్థిరపడ్డాయి. ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంక్స్ కొంతమేర రాణించాయి. అధిక వెయిటేజీ రంగాలు రెడ్‌లోనే ముగిశాయి. అదానీ పోర్ట్స్ అత్యధికంగా 5% లాభపడింది. Titan, Asian Paints టాప్ లూజర్స్.
Similar News
News December 27, 2024
రికార్డు సృష్టించిన పుష్ప-2 మూవీ
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.740.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన 3వ వారంలోనూ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. 22 రోజుల్లో ఈ సినిమాకు బాలీవుడ్‌లో రూ.740.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రూ.1719.5 కోట్లు కలెక్ట్ చేసింది.
News December 27, 2024
మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్, కేంద్రం మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కోరగా కేంద్రం స్పందించకపోవడంపై INC అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. INCని సంప్రదించకుండానే నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని హోంశాఖ ప్రకటించింది. కాగా స్మారక చిహ్నం ఏర్పాటు ఆయనకు ఘనమైన నివాళి అని మోదీకి ఖర్గే లేఖ రాశారు.
News December 27, 2024
పార్టీ శ్రేణుల అంకితభావానికి హ్యాట్సాఫ్: జగన్
AP: కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ YCP శ్రేణులు చేపట్టిన నిరసనలు విజయవంతం అయ్యాయని YS జగన్ ట్వీట్ చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. పార్టీ పిలుపుతో ప్రజలకు బాసటగా నిలుస్తూ ప్రతి నియోజకవర్గంలో గొప్పగా కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావం, చిత్తశుద్ధికి జగన్ హ్యాట్సాఫ్ తెలిపారు.