News December 26, 2024
రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.
Similar News
News December 27, 2024
‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి 30న పొంగల్ సాంగ్
విక్టరీ వెంకటేశ్ కొత్త మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి థర్డ్ సింగల్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. పొంగల్ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ట్రెండింగ్‌లో ఉండగా, పొంగల్ సాంగ్ కూడా చాట్‌బస్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
News December 27, 2024
MPDOపై దాడి.. పవన్ కళ్యాణ్ ఆగ్రహం
AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO శ్రీ జవహర్ బాబుపై YCP నేత సుదర్శన్ చేసిన దాడిని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావు లేదని స్పష్టం చేశారు. అటు రేపు కడప రిమ్స్‌కు వెళ్లనున్న పవన్ బాధిత MPDOను పరామర్శిస్తారు.
News December 27, 2024
త్వరగా నిద్ర రావాలంటే ఇలా చేయండి!
ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT