News March 16, 2024

స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 2/2

image

లాభాల్లో గరిష్ఠంగా 7.5శాతాన్నే డొనేట్ చేయాలనే నిబంధన పోవడంతో టర్నోవర్‌తో సంబంధం లేకుండా కంపెనీలు విరాళాలు ఇస్తున్నాయి. 2023లో టీషార్క్స్ ఇన్‌ఫ్రా, టీషార్క్స్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చెరో రూ.లక్షతో ఏర్పడిన కొన్ని నెలలకే రూ.7.5కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. అపర్నా ఫార్మ్స్ రూ.5లక్షలతో ఏర్పడగా రూ.30కోట్లు విలువైన బాండ్స్ కొంది. ఇలా సంస్థలు స్థోమతకు మించి బాండ్స్ కొనడం చర్చనీయాంశమైంది.

Similar News

News September 4, 2025

పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగులు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం IASల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. సర్వే సెటిల్‌మెంట్స్‌&ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా R.కూర్మనాథ్‌, తూ.గో. జాయింట్‌ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్, గుంటూరు JCగా A.శ్రీవాస్తవ, మన్యం JCగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అల్లూరి(D) పాడేరు ITDA POగా తిరుమాని శ్రీపూజ, AP విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరీగా కె.ఆర్‌.కల్పశ్రీ, విశాఖ(D) రంపచోడవరం ITDA POగా స్మరణ్‌రాజ్‌‌లను నియమించింది.

News September 4, 2025

వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

image

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.

News September 4, 2025

GST శ్లాబులతో సామాన్యులకు మేలు: మోదీ

image

సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేలా కొత్త GST <<17605492>>శ్లాబులు<<>> ప్రకటించామని PM మోదీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోదీ వెల్లడించారు.