News December 26, 2024

విశాఖ: కూటమిలో ఆడారి ఇముడుతారా?

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News December 28, 2024

బాల్య వివాహాల నిర్మూలనను బాధ్యతగా స్వీకరించాలి: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనను అందరం బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి బాల్య వివాహాల కమిటీ హైబ్రిడ్ సమావేశం నిర్వహించారు. పీవీటీజీ తెగలు, బడి మానేసిన పిల్లలలో బాల్య వివాహాలు జరుగుతున్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత రెండేళ్లలో 25 బాల్య వివాహాలు నిరోధించినప్పటికీ గత రెండేళ్లలో 357 మంది టీనేజ్ గర్భవతులు ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

News December 27, 2024

విశాఖ: మెముకు బదులుగా సాధారణ రైళ్లు

image

మెముకు బదులుగా సాధారణ రైళ్లును ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడపనున్నట్లు వాల్తేరు డిసీఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-పలాస-విశాఖ నెంబర్లతో ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు శుక్ర, ఆదివారాలు మినహా ఈ రైలు నడుస్తుందన్నారు. విశాఖ-విజయనగరం మధ్య మెము పాసింజర్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు గురువారాలు మినహా సాధారణ రైలుగా నడుస్తుందని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడుస్తుందన్నారు.

News December 27, 2024

PHOTO: వంజంగిలో ఎర్రబడ్డ ఆకాశం

image

అల్లూరి ఏజెన్సీ విభిన్న వాతావరణాలకు నిలయం. ఇక్కడ ఏ సమయంలో వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. ఎప్పుడూ మేఘాలతో ఉండే పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆకాశం ఎర్రగా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఈ దృశ్యాల్ని బంధించి ఆందించారు.