News March 16, 2024

స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 1/2

image

కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.

Similar News

News September 29, 2024

రాష్ట్రంలో ఘోరం.. ఏడో తరగతి బాలికపై అత్యాచారం

image

TG: రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఓ గ్రామంలో ఏడో తరగతి బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబసభ్యులు నిందితుడి ఇంటిని తగులబెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

News September 29, 2024

చంద్రబాబు, లోకేశ్ ఇతరుల సంతోషాన్ని ఓర్వలేరు: VSR

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి Xలో సెటైర్లు వేశారు. ‘నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు. ప్రభూ! చంద్రబాబు, ఆయన సుపుత్రుడు లోకేశ్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటున్నారు అని? శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు, లోకేశ్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు’ అని VSR చంద్రబాబును ట్యాగ్ చేశారు.

News September 29, 2024

అది న్యాయానికి కొల‌మానం.. న‌స్ర‌ల్లా మృతిపై బైడెన్‌

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హ‌త‌మార్చ‌డాన్ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ సమర్థించారు. ‘నాలుగు దశాబ్దాల తీవ్రవాద పాలనలో వందలాది మంది అమెరికన్ల మరణానికి నస్రల్లా, హెజ్బొల్లానే కారణం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతని మరణం ఇజ్రాయెలీలు, లెబనీస్ పౌరులతో సహా వేలాది మంది అత‌ని బాధితులకు న్యాయం చేసే కొలమానం’ అని పేర్కొన్నారు.