News December 26, 2024
శ్రీకాకుళం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా పూర్ణిమ
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం జిల్లా, సర్వసభ్య సమావేశం పట్టణంలోని గూనపాలెంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గ ఎంపికలు ఎన్నికల అధికారి శివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన జిల్లా సంఘ అధ్యక్షురాలుగా ఎస్ వి ఎస్ఎల్ పూర్ణిమ, సెక్రటరీగా కె. జగన్ మోహన్ రావు , ట్రెజరర్ గా కె. మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News December 28, 2024
ఎచ్చెర్ల: దారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు
ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
News December 27, 2024
రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 27, 2024
SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం
శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.